![]() |
![]() |

"డ్యూడ్" మూవీ ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. దాంతో హీరో ప్రదీప్ రంగనాథన్, శరత్ కుమార్ ఇద్దరూ నెక్స్ట్ వీక్ జబర్దస్త్ షోకి గెస్టులుగా రాబోతున్నారు. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. వీళ్ళు స్టేజి మీదకు రాగానే రష్మీ అడిగింది. "ఈ అల్లుడు నుంచి ఎం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో " అంటూ ప్రదీప్ ని చూపించి శరత్ కుమార్ ని అడిగింది రష్మీ. "మంచి అల్లుడు అండి. నేను ఎం చెప్తానో అది చేస్తారు. ఇప్పుడు కాదండి పిక్చర్ లో చెప్తున్నాను " అంటూ చెప్పారు శరత్ కుమార్. ఇక ప్రోమో లాస్ట్ లో ఐతే రాంప్రసాద్ శరత్ కుమార్ తో ఇలా అన్నాడు. "శరత్ కుమార్ సర్ ఈ ఏజ్ లో కూడా మీ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సర్ దానికి హ్యాట్సాఫ్ సర్" అన్నాడు. వెంటనే ఆయన థ్యాంక్యూ అని చెప్పారు.
"మీరు ఇప్పుడు కూడా రఫ్ గా 40 , 41 అని మీ వయసు చెప్పుకోవచ్చు సర్" అని మళ్ళీ రాంప్రసాద్ అనేసరికి దానికి శరత్ కుమార్ "లేదు 35 " అని కౌంటర్ వేసేసరికి రాంప్రసాద్ తలబాదుకున్నాడు. ఇక హీరో ప్రదీప్ రంగనాథ్ బులెట్ భాస్కర్ స్కిట్ లో వర్షకి అన్న రోల్ లో నటించి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఇక నెటిజన్స్ ఐతే "శరత్ కుమార్ గారు పెద్ద యాక్టర్ జబర్దస్త్ కి రావడం గ్రేట్" అంటున్నారు. ఇంకొంతమంది నెటిజన్స్ ఐతే "ప్రదీప్ రంగనాథన్ బెస్ట్ రెస్పెక్ట్, ఆయన టైమింగ్ బాగుంది" అంటూ కామెంట్ చేస్తున్నారు. "డ్రాగన్" మూవీతో హీరో ప్రదీప్ మీద ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. ఇక ఇప్పుడు డ్యూడ్ తో తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు. తమిళ్ లో కంటే ఈ మూవీకి తెలుగులోనే మంచి కలెక్షన్స్ ని అందుకుంటోంది.
![]() |
![]() |